కళ్యాణదుర్గం: దేశంలోనే అత్యధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మనదే: కృష్ణాపురంలో ఎమ్మెల్యే సురేంద్రబాబు
దేశంలోనే అత్యధిక పెన్షన్లను ఇస్తున్న రాష్ట్రం మన రాష్ట్రమేనని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు. కుందుర్పి మండలం కృష్ణాపురంలో బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కు పేదలంటే చాలా ఇష్టం అన్నారు. అందుకోసమే నెల నెల పేదలకు ఇంటింటికి పెన్షన్లు ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వానికి అండగా ఉండాలన్నారు.