ఉరవకొండ: కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై క్షేత్రస్థాయి సిబ్బందికి శిక్షణా కార్యక్రమం
కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరు/ సామర్థ్యం మెరుగుపడుట పై ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని అనంతపురం జిల్లా ఉరవకొండ లోని మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు.వ్యవసాయ శాఖ పథకాలైన అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్, ప్రకృతి వ్యవసాయం, భూసార పరీక్షల నమూనా, ఇ పంట నమోదు, ఇన్పుట్ సబ్సిడీ, వాతావరణ బీమా, ఆంధ్రప్రదేశ్ ఫార్మర్ రిజిస్ట్రీ, ఫార్మర్ యాప్, ఎరువుల పంపిణీ మొదలగు పథకాల యందు కృత్రిమ మేధస్సును ఉపయోగించి నివేదికలు తయారు చేయడంపై ట్రైనర్ దిలీప్ చౌదరి, రహీమ్ వివరించారు.