సంతనూతలపాడు: రామతీర్థం గ్రానైట్ క్వారీలో మృతి చెందిన కార్మికుడిని గుట్టుచప్పుడు కాకుండా ఒంగోలుకు తరలించడంపై కార్మికుల ఆగ్రహం
చీమకుర్తి మండలం రామతీర్థంలో జెసిబి యంత్రంతో గ్రానైట్ రాయిని తీస్తుండగా జెసిబి ని ఆపరేట్ చేస్తున్న వ్యక్తి గురువారం అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే కార్మికుడి మృతదేహాన్ని గుట్టు చప్పుడు కాకుండా గుడ్డలో చుట్టి యాజమాన్యం ఒంగోలుకు తరలించడం పట్ల మృతుడి సోదరుడు మరియు, తోటి కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.