కనిగిరి: పట్టణంలోని అమరావతి గ్రౌండ్ లో 57 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి
కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్ నందు కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కనిగిరి నియోజకవర్గం లోని 57 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన రూ.29,32,948లు విలువచేసే చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... కార్పొరేట్ వైద్యశాలలో ఆపద సమయాల్లో అప్పుచేసి వైద్యం చేయించుకున్న పేదలను ఆదుకోవాలని ఉద్దేశంతో సీఎంఆర్ఎఫ్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక సహాయాన్ని చేస్తున్నారని, లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.