కనిగిరి: పట్టణంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి
కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలను కనిగిరి శాసనసభ్యులు మరియు ఉమ్మడి ప్రకాశం జిల్లా టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూతనంగా ఆసుపత్రిలో నిర్మిస్తున్న డయాలసిస్ సెంటర్, మార్చరిగది నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, రోగులనుండి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే వైద్యులను ఆదేశించారు.