ఉరవకొండ: తుంగభద్ర నదిలో జరిగిన ఐదు మంది గల్లంతైన విషాద ఘటనలో అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన సంధ్య మృతదేహం లభ్యం
కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో జరిగిన ఐదు మంది గల్లంతైన విషాద ఘటనలో అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన సంధ్య (22) శనివారం ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు నిరంతరంగా గాలింపు చర్యలు చేపట్టి ఆదివారం మృతదేహాలను వెలికితీశాయి. లభ్యమైన ఐదు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలు సంధ్య అక్క నిర్మల వివాహం ఈ నెల 7వ తేదీన జరిగింది. వివాహానంతరం నిర్వహించే సత్యనారాయణ స్వామి వ్రతం కోసం కుటుంబ సభ్యులంతా మే 30న మంత్రాలయం వెళ్లారు. ఈ సందర్భంగా తుంగభద్ర నదిలో స్నానాలకు దిగగా ప్రమాదవశాత్తూ ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.