ఉరవకొండ: ప్రభుత్వ వసతి గృహాలలో ఆల్ఫా సైబర్ మెట్రో క్రిమిసంహారకమందు పిచికారి
అనంతపురం జిల్లా విడపనకల్లు మండలంలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలలో ఆల్ఫా సైబర్ మెట్రో క్రిమిసంహారకమందును జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉరవకొండ డివిజన్ మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి మలేరియా వర్కర్ల చేత గురువారం పిచికారి చేయించారు. ఈ సందర్భంగా కోదండరాంరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ వసతి గృహాలలో ఉండి చదువుకునే విద్యార్థులకు దోమల వల్ల మలేరియా చికెన్ గునియా డెంగ్యూ బోదకాలు మెదడువాపు వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలుగా నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆదేశాల మేరకు మందుల పిచికారి యుద్ధ ప్రాతిపదికన డివిజన్లో చేపట్టామన్నారు.