సంతనూతలపాడు: చీమకుర్తి మండలం పల్లామల్లిలో ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో కిషోరి వికాసం-2026 పై అవగాహన కార్యక్రమం
చీమకుర్తి మండలం లోని పల్లామల్లిలో ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో మంగళవారం కిషోర్ వికాసం -2026 పై అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. కౌమార దశలోని 11 నుండి 18 సంవత్సరాల లోపు బాలికలకు వారి హక్కులు మరియు రక్షణ పై ఐసిడిఎస్ సూపర్వైజర్లు అవగాహన కల్పించారు. సమాజంలో బాల్యవివాహాల వల్ల కలిగే అనర్ధాలు వివరిస్తూ వాటిని పూర్తిగా అరికట్టాలని సూచించారు. బాలికల రక్తహీనత ,వ్యక్తిగత పరిశుభ్రత, ఆహార ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.