ఉరవకొండ: రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశం అత్యంత దిగజారుడు పద్ధతిలో జరిగింది: వైయస్సార్సీపి పిఏసి సభ్యులు వై విశ్వేశ్వర్ రెడ్డి
ప్రభుత్వం నిర్వహించిన రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశం అత్యంత దిగజారుడు పద్ధతిలో జరిగిందని వైయస్సార్సీపి పిఎసి సభ్యులు వై విశ్వేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఉరవకొండలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పీఏసీ సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలోనే ఒక ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటుచేసి ఐదున్నర గంటల సమావేశంలో మూడున్నర గంటల పాటు వైఎస్ఆర్సిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తూ స్థాయిని మరిచి అత్యంత దిగజారుడుతనంతో ప్రభుత్వ పెద్దలందరూ మాట్లాడటం బాధాకరమని పేర్కొన్నారు.