ఉరవకొండ: విహారయాత్రలో విషాదం, పీఏబీఆర్ డ్యామ్ వద్ద నీట మునికి మహిళ, మరో బాలిక మృతి.
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామ సమీపంలోని పీఏబీఆర్ డ్యామ్ చివరన నీట మునిగి మహిళ, బాలిక మృతి చెందిన ఘటన శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. అనంతపురంలోని అజాద్ నగర్ కు చెందిన 9 మంది కుటుంబసభ్యులు శనివారం పీఏబీఆర్ డ్యామ్ సమీపంలో విహారయాత్రకు వెళ్లారు. కౌకుంట్ల గ్రామం చివర డ్యామ్ వద్ద ఆడుకుంటున్న సమయంలో షేక్ ఫరీదా (35), షేక్ యాస్మిన్(13) ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి మునిగిపోయారు. ఈత రాకపోవడంతో ఇద్దరూ ఊపిరాడక మృతి చెందారు. మృతురాలి తల్లి షేక్ కుర్సీద్ భాను ఫిర్యాదు మేరకు ఉరవకొండ ఎస్సై జనార్ధన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.