ఉరవకొండ: బెళుగుప్పలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక విద్యుత్ అదాలత్ కార్యక్రమం
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని శ్రీ వాసవి కళ్యాణ మండపం నందు గురువారం మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికగా ప్రత్యేక విద్యుత్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని కార్యక్రమం చైర్మన్ రిటైర్డ్ జడ్జి అయిన శ్రీనివాస ఆంజనేయ మూర్తి పేర్కొన్నారు. మండల విద్యుత్ శాఖ ఏఈ గంగాధర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆర్థిక సభ్యులు మధు కుమార్ సాంకేతిక సభ్యులు శ్రీనివాస బాబు స్వతంత్ర సభ్యులు విజయలక్ష్మి, డి ఈ కళ్యాణ చక్రవర్తిలు పాల్గొని విద్యుత్వినియోగదారులతో ఆర్జీలను స్వీకరించారు.