మహబూబ్ నగర్ అర్బన్: మొహరం పీర్ల పండుగను తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తించాలన పట్టణంలో మొహరం పీర్ల పండుగ నిర్వాహకుల సంఘం నాయకులు నిరసన
మొహరం పీర్ల పండుగను తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తించాలని మొహరం పీర్ల పండుగ నిర్వాహకుల సంఘం డిమాండ్ చేస్తూ ఆదివారం మహబూబ్నగర్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తా దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా మొహరం పీర్ల పండుగ నిర్వాహకుల సంఘం నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం మొహ్రార పండుగను తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తిస్తామని చెప్పి ఇప్పటివరకు గుర్తించలేదనిమొహరం పీర్ల పండుగ నిర్వాహకుల సంఘం నాయకులు మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మొహరం పీర్ల పండుగను తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తించాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.