మహబూబ్ నగర్ అర్బన్: పట్టణంలో ఆర్టీసీ షాపింగ్ కాంప్లెక్స్ ముందు ఉద్రిక్తత
మహబూబ్ నగర్ పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ ముందు నూతనంగా నిర్మించిన ఆర్టీసీ షాపుల ముందు ఉన్న పండ్ల దుకాణాలను తొలగించడానికి యాజమాన్యం ప్రొక్లెన్ లతో శనివారం ప్రయత్నించగా ఉద్రిక్తత నెలకొన్నది. గత సంవత్సరం మహబూబ్ నగర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ముందు 20 షాపులను నిర్మించి ఆన్ లైన్ ద్వారా అద్దె ప్రాతిపదికన టెండర్లను నిర్వహించింది. ఒక్కొక్క షాపునకు కోట్ చేసిన నెలవారీ అద్దెను ఆరు రెట్లు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని నిబంధనలు ఉన్నాయి. అలా ఒక్కొక్క షాపునకు 45 నుండి 50 వేల రూపాయల అద్దెను టెండర్ దారులు కోట్ చేశారు. ఇలా ఒక్కొక్క షాపునకు పై 2.5 నుండి 3 లక్షలు ఆపైన రూపాయల వరకు డిపాజిట్ చేశారు.