మహబూబ్ నగర్ పట్టణ శివార్లలోని శనివారం మయూరి అర్బన్ ఎకోపార్క్ తిరుమల హిల్స్, అప్పన్నపల్లి, ఏనుగొండ తదితర ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో మహబూబ్నగర్-జడ్చర్ల మధ్య ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మయూరి పార్క్ ప్రాంతంలో తలదాచుకునేందుకు చోటులేకపోవడంతో ప్రజలు అవస్థలు పడ్డారు.