సంతనూతలపాడు: మద్దిపాడు మండలం బసవన్నపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేసిన సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్
మద్దిపాడు మండలం బసవన్నపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలలో సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్ విజయ్ కుమార్ సోమవారం విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక వసతులను కల్పిస్తుంది అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజన సదుపాయాలను కల్పిస్తుంది అన్నారు. అదేవిధంగా విద్యార్థులకు ఉచితంగా యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.