కనిగిరి: హనుమంతునిపాడు మండలంలోని పలు రేషన్ దుకాణాలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించిన తహసిల్దార్
ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలంలో శనివారం పలు రేషన్ దుకాణాలను తాహాసిల్దార్ ఆకస్మికంగా సందర్శించారు. రికార్డులను స్టాకును తనిఖీ చేశారు. ప్రతి నెల ఒకటవ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ దుకాణాల వద్ద ప్రజలకు రేషన్ సమయం కేటాయించిన సమయంలో ఇవ్వాలని తెలిపారు. ఇక వృద్ధులకు వికలాంగులకు నాలుగు రోజుల ముందరే ఇళ్ల వద్దకు తెచ్చి వారికి రేషన్ అందిస్తామని తహసిల్దార్ ప్రజలకు తెలిపారు.