కనిగిరి: ఒంగోలులో జరుగు సిపిఐ పార్టీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి:: సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు రవీంద్రబాబు
కనిగిరి: ఆగస్టు 20 నుండి 25వ తేదీ వరకు ప్రకాశం జిల్లా ఒంగోలులో జరుగు సిపిఐ పార్టీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ పార్టీ ప్రకాశం జిల్లా కార్యవర్గ సభ్యులు వై రవీంద్రబాబు కోరారు. కనిగిరి లోని సిపిఐ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మహాసభలకు సంబంధించిన గోడపత్రికలను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి శుక్రవారం రవీంద్రబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పేదలు, కార్మికుల పక్షాన పోరాడుతున్న ఏకైక పార్టీ సిపిఐ పార్టీ అన్నారు. సిపిఐ పార్టీ మహాసభలకు ప్రజలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.