కనిగిరి: పట్టణంలో మలేరియా నివారణ మాసోత్సవాల సందర్భంగా కనిగిరి డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ సృజన ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ
కనిగిరి పట్టణంలో మలేరియా వ్యాధి నివారణ మాసోత్సవాల సందర్భంగా డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ సృజన ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది విద్యార్థులతో కలిసి శుక్రవారం అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ సృజన మాట్లాడుతూ... దోమ కాటు వల్ల మలేరియా వ్యాధి సంభవిస్తుందన్నారు. దోమలు కొట్టకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇళ్లలో, పరిసర ప్రాంతాలలో మీరు నిలవ ఉండకుండా చూసుకోవాలని, నీటి నిలువలతో దోమలు వృద్ధి చెందుతాయన్నారు. మలేరియా లక్షణాలు ఉంటే ప్రాథమిక వైద్యశాలలో చికిత్స చేయించుకోవాలన్నారు.