కనిగిరి: పట్టణంలోని 16,17,18 వార్డుల్లో చిల్లర చెట్ల సమస్యలను రెండు,మూడు రోజుల్లో పరిష్కరిస్తాం: కనిగిరి మున్సిపల్ చైర్మన్ గఫార్
కనిగిరి పట్టణంలోని 16, 17, 18 వార్డులలో మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా వార్డుల్లో చిల్ల చెట్లు విపరీతంగా పెరిగిపోయి విష జంతువులు ఇళ్ళలోకి వస్తున్నాయని, తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు మున్సిపల్ చైర్మన్ కు ఫిర్యాదు చేయగా, జెసిబి యంత్రాలతో రెండు మూడు రోజుల్లో చిల్ల చెట్లను పూర్తిగా తొలగించి సమస్యను పరిష్కరిస్తామని మున్సిపల్ చైర్మన్ స్థానికులకు హామీ ఇచ్చారు. అదేవిధంగా వార్డుల్లో ఎక్కడ పారిశుద్ధ కార్యక్రమాల పట్ల అలసత్వం వహించకుండా ప్రతిరోజు కార్యక్రమాలు చేపట్టేటట్లు మున్సిపల్ పారిశుద్ధ సిబ్బందికి ఆదేశాలు ఇస్తామని చైర్మన్ అన్నారు.