కనిగిరి: ఆటో డ్రైవర్లు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: కనిగిరి ఎస్సై శ్రీరామ్
కనిగిరి పట్టణంలోని పామూరు బస్టాండ్ సెంటర్లో ఆటో డ్రైవర్లకు ఎస్సై శ్రీరామ్ శుక్రవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని, మద్యం సేవించి ఆటోలు నడపవద్దన్నారు. మద్యం సేవించి ఆటోలు నడపడం వల్ల ప్రమాదాలు జరిగితే ప్రయాణికులు గాయాలు పాలు అవ్వడమో, లేదా ప్రాణాలు కోల్పోవడం జరుగుతుందన్నారు. అన్ని రకాల ధ్రువపత్రాలు ఆటో డ్రైవర్లు తమ వద్ద ఉంచుకోవాలని, ద్రోపత్రాలు లేకుండా ప్రయాణిస్తే చర్యలు తప్పమన్నారు.