కనిగిరి: కనిగిరిలో పొగాకు బోర్డు వద్ద రైతుల నుంచి పొగాకు కొనుగోలు చేయాలని నిరసనకు దిగిన స్థానిక రైతులు
ప్రకాశం జిల్లా కనిగిరిలో పొగాకు బోర్డు వద్ద శనివారం పొగాకు రైతులు వెంటనే పొగాకు కొనుగోలు చేయాలని నిరసనకు దిగారు. రైతు సంఘం నాయకుడు తిప్పారెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మార్క్ ఫెడ్ ద్వారా పొగా కొనుగోలు చేసేందుకు 2000 కోట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పొగాకు రైతులు అధిక మొత్తంలో పొగాకు పంటను సాగు చేసి అమ్ముకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి వెంటనే పొగాకు రైతుల వద్ద నుంచి పొగాకు కొనుగోలు చేయాలని అన్నారు.