ఉరవకొండ: గంగవరం, కోనంపల్లి గ్రామాల్లో రాజముద్రతో కూడిన ఈపాస్ పుస్తకాలను పంపిణీ చేసిన బెళుగుప్ప మండల తహసీల్దార్ అనిల్ కుమార్
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని గంగవరం, కోనంపల్లి గ్రామాల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీ సర్వే పూర్తికాబడిన గ్రామాల యందు రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ కార్యక్రమంను మంగళవారం మండల తహసిల్దార్ అనిల్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. గంగవరంలో 855, కోనంపల్లిలో 860 మంది రైతులకు గ్రామాల ఎలాంటి తప్పులు లేని పట్టాదారు పాసుపుస్తకాలు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం నందు మండల రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్ గురు బ్రహ్మ, వీఆర్వోలు రాజశేఖర్,యాస్మిన్, గ్రామ రైతులు పాల్గొన్నారు.