కొండపి: సింగరాయకొండ మండలం పాకాల సముద్రతీరంలో సందర్శకుల సందడి, అప్రమత్తంగా వ్యవహరించిన పోలీసులు
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలోని పాకాల సముద్ర తీరంలో పర్యాటకులు సందడి చేశారు. ఆదివారం కావడంతో ఉమ్మడి ప్రకాశం జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పర్యాటకులు సముద్ర తీరంలో స్నానాలు చేసి సందడి చేశారు. చిన్న పిల్లలు ఇసుక దిమ్మెలపై ఆటలాడుతూ ఆనందంగా గడిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా మెరైన్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.