రాప్తాడు: ప్రజా ప్రతినిధులు అసభ్యంగా మాట్లాడితే వారికి కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి అనంతపురంలో రాప్తాడు ఆర్పిఎస్ వ్యవస్థాపకుడు నాగరాజు
అనంతపురం జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల 20 నిమిషాల సమయంలో రాప్తాడు ఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగరాజు జిల్లా ఎస్పీ జగదీష్ ను కలిసి అసభ్యంగా మాట్లాడుతున్న ప్రజాప్రతినిధులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యేలు అయి ఉండి ప్రజల సమస్యలు గాలికి వదిలేసి తమ స్వార్ధ రాజకీయాల కోసం ప్రతిపక్షాలతో నిత్యం గొడవలు సృష్టించుకున్న ప్రజాప్రతినిధులకు జిల్లా ఎస్పీ కౌన్సిలింగ్ ఇవ్వాలని రాప్తాడు ఆర్ పి ఎస్ వ్యవస్థాపకుడు నాగరాజు జిల్లా ఎస్పీని కోరారు,ఈ కార్యక్రమంలో ఆర్పీఎస్ నేతలు పాల్గొన్నారు.