సంతనూతలపాడు: ఉప్పుగుండూరులో పెట్రోల్ బంకులను తనిఖీ చేసిన ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనకుమారి
నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరులో ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ కల్పనకుమారి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక అధికారులతో కలిసి పెట్రోల్ బంకులను జాయింట్ కలెక్టర్ తనిఖీ చేశారు. పెట్రోల్, డీజిల్ కొరతలేదని , ఉద్దేశపూర్వకంగా కృత్రిమ కొరతను సృష్టించే పెట్రోల్ బంకుల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ హెచ్చరించారు. స్టాకు ఉన్నంతవరకు వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ విక్రయాలు జరపాలన్నారు. డ్రమ్ములు లేదా క్యాన్ల లో పెట్రోల్, డీజిల్ విక్రయించవద్దని సూచించారు.