రాయదుర్గం: ఓబులాపురం సమీపంలో గూడ్స్ రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం
డి.హిరేహాల్ మండలం ఓబులాపురం సమీపంలో గూడ్స్ రైలు వ్యాగన్ కిందపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. రైల్వే పోలీసులు వివరాల ప్రకారం శనివారం సాయంత్రం సుమారు 50 ఏళ్ల వ్యక్తి గూడ్స్ రైలు కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో శరీరం రెండు ముక్కలుగా చెల్లాచెదురుగా పడింది. రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు లైట్ బ్లూ రంగు షర్టు, నల్ల ప్యాంటు ధరించి ఉన్నాడు. అతని వివరాలు తెలిసిన వారు 9247575605 నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని రైల్వే పోలీసులు కోరారు.