సంతనూతలపాడు: నాగులుప్పలపాడు మండలం అమ్మానాబ్రోలులో అగ్నిప్రమాదం, రూ.50 లక్షలు ఆస్తి నష్టం
నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలులో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక సినిమా ధియేటర్ పక్కన ఉన్న పాత ఇనుప దుకాణంలో ఈ అగ్ని ప్రమాదం జరగగా, దుకాణం మొత్తం అగ్నికి ఆహుతి అయింది. దుకాణంలోని సామాగ్రి మరియు ప్లాస్టిక్ వస్తువులను రీసైక్లింగ్ చేసే రెండు మిషన్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ప్రమాదంలో రూ.50 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు దుకాణ యజమాని తెలిపాడు.