రాప్తాడు: చెన్నై కొత్తపల్లిలో అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించినందుకు సంబరాలు నిర్వహించిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండల కేంద్రంలో శనివారం 11 గంటల 45 నిమిషాల సమయంలో అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించినందుకు కృతజ్ఞతగా టిడిపి నేతలతో కలిసి ఎమ్మెల్యే పరిటాల సునీత సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతి మరింత అభివృద్ధి చెందని అమరావతి అభివృద్ధి కోసమే పార్లమెంటు సమావేశంలో చట్టబద్ధత కల్పించడం జరిగిందని అందుకు కృతజ్ఞతగా టిడిపి నేతలతో కలిసి సంబరాలు నిర్వహించి ర్యాలీ నిర్వహించడం జరిగిందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.