రాప్తాడు: రాప్తాడు లో ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ చిల్డ్రన్ పార్క్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే పరిటాల సునీత హిందూపురం ఎంపీ పార్థసారథి
రాప్తాడు మండల కేంద్రంలో బుధవారం 12 గంటల పది నిమిషాల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత హిందూపురం ఎంపీ పార్థసారథి తదితరులు ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ ను చిల్డ్రన్ పార్కును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ పార్థసారథి మాట్లాడుతూ ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రత్యేక ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ ప్రారంభిస్తున్నామని అదే విధంగా చిల్డ్రన్ పార్క్ ను కూడా ప్రారంభించడం జరిగిందని రాప్తాడులో అన్నా క్యాంటీన్ వ్యవసాయ కూలీలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చిన్నపిల్లల కోసం చిల్డ్రన్ కూడా నిర్మించడం జరిగిందని భవిష్యత్తులో రాప్తాడు మరింత అభివృద్ధి చేస్తామని ఎంపీ పార్థసారథి పేర్కొన్నారు