రాప్తాడు: రామగిరిలో రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు తీసుకున్న సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్
రామగిరి మండల కేంద్రంలో బుధవారం 11:30 గంటల నుంచి మూడున్నర గంటల వరకు రెవిన్యూ క్లినిక్ కార్యక్రమంలో ప్రజల నుంచి సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సమస్యలను అర్జీ రూపంలో తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మాట్లాడుతూ రామగిరి మండల కేంద్రంలో రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాన్ని నిర్వహించి మూడు మండలాల్లోని ప్రజల నుంచి 160 అర్జీలను తీసుకోవడం జరిగిందని వాటిలో రెవెన్యూ సమస్యలు ఎక్కువ రావడం జరిగిందని వాటిని పరిష్కరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించడం జరిగిందని సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ పేర్కొన్నారు.