తాడిపత్రి: బుర్నా కుంట లో విషాదం, టెన్త్ విద్యార్థి పృద్విరాజ్ (14) ప్రమాదవశాత్తు యాడికి కాలువలో పడి మృతి, పోలీసులు దర్యాప్తు
పెద్దవడుగూరు మండలం బుర్నాకుంట గ్రామానికి చెందిన శశికళ కుమారుడు పదవ తరగతి విద్యార్థి పృధ్విరాజ్ (14) యాడికి కాలువలో పడి మృతి చెందాడు.ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది.పృధ్విరాజ్ లక్ష్యం పల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. పృధ్విరాజ్ పొలం వద్దకు వెళ్లడానికి కాలువ దాటుతున్న సమయంలో జారిపడ్డాడు. దీంతో ఊపిరాడక మృతి చెందాడు. దీంతో బుర్నాకుంటలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటనపై పెద్దవడుగూరు ఎస్సై ఆంజనేయులు దర్యాప్తు చేపట్టారు.