కనిగిరి: పీఎం సూర్య ఘర్ యోజన పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి: బిజెపి జిల్లా నాయకులు కొండిశెట్టి వెంకటరమణయ్య
చంద్రశేఖరపురం మండలంలోని ఎస్సీ కాలనీలో బిజెపి జిల్లా నాయకులు కొండిశెట్టి వెంకటరమణయ్య ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా పీఎం సూర్య ఘర్ పథకం ద్వారా ఏర్పాటుచేసిన సోలార్ యూనిట్ లను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం పూర్తి రాయితీతో సోలార్ యూనిట్లను ఏర్పాటు చేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. అదేవిధంగా ఇతర వర్గాల వారికి దాదాపు 45% సబ్సిడీతో సోలార్ యూనిట్లను ఏర్పాటు చేస్తారని, సోలార్ యూనిట్లు ఏర్పాటుతో వినియోగదారులకు కరెంట్ బిల్లుల భారం తప్పుతుందన్నారు.