గిద్దలూరు: గిద్దలూరు మండలం అంబవరం అటవీ ప్రాంతంలో అడవి పందిని వేటాడిన ఇద్దరు వేటగాళ్లకు 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలంలోని గుండ్లకమ్మ రేంజ్ పరిధిలో ముళ్ళ పందిని నాటు తుపాకితో వేటాడి చంపిన ఇద్దరు వేటగాళ్లను అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు వేటగాళ్లకు 14 రోజులు రిమాండ్ విధించింది. వన్యప్రాణులను వేటాడితే చర్యలు తప్పవని అటవీశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.