సంతనూతలపాడు: మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం: సంతనూతలపాడు లో వెలుగు ఏపిఎం టి బాబురావు
సంతమతులపాడు లోని డిఆర్డిఏ, వెలుగు కార్యాలయంలో బుధవారం వార్షిక రుణ జీవనోపాదుల ప్రణాళిక గురించి వివోఏలు, సీఆర్పీలకు ఏపీఎం టి బాబురావు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎం బాబురావు మాట్లాడుతూ.... మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. 2026- 27లో పొదుపు గ్రూపులను ఏ విధంగా ఏర్పాటు చేయాలి, వారికి ప్రభుత్వం ద్వారా ఎలా రుణాలు మంజూరు చేయించాలో వివరించారు. ప్రభుత్వం ద్వారా మంజూరైన రుణాలకు సంబంధించి మహిళల జీవనోపాధికి యూనిట్లను ఎలా స్థాపించాలో ఏపిఎం వివరించారు.