కనిగిరి: పట్టణంలో వైభవంగా శ్రీ వాసవి మాత విగ్రహ పున: ప్రతిష్ట కార్యక్రమాలు, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
కనిగిరి పట్టణంలోని రామాలయం వీధిలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ వాసవి మాత ఆలయంలో శ్రీ వాసవి మాత విగ్రహ పున :ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ప్రతిష్ట చేసే శ్రీ వాసవి మాత విగ్రహానికి వేద పండితుల ఆధ్వర్యంలో క్షీరాభివాసము, మూలమంత్ర అనుస్థాపన, మహన్యాస పూర్వక రుద్రాభిషేక కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. కనిగిరి పట్టణంతోపాటు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు కార్యక్రమానికి తరలివచ్చారు. కార్యక్రమం అనంతరం భక్తులకు ఆశీర్వచనాలను అందజేసిన పండితులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.