కనిగిరి: పేరంగుడి పల్లి లో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించిన రాష్ట్ర సర్వ శిక్ష అభియాన్ అదనపు సంచాలకులు రవీంద్రనాథ్ రెడ్డి
కనిగిరి: రాష్ట్ర సర్వ శిక్ష అభియాన్ పథక అదరపు సంచాలకులు కే రవీంద్రనాథ్ రెడ్డి మార్కాపురం జిల్లా కనిగిరి మండలం పేరంగుడిపల్లి లో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథక అమలుతీరును ఆయన పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులకు సూచించారు. పాఠ్యపుస్తకాలు మరియు యూనిఫామ్స్ పంపిణీ వంటి అంశాలను ప్రధానోపాధ్యాయుడు మరియు ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో మార్కాపురం జిల్లా పరీక్షల సహాయ కమిషనర్ రాజాల కొండారెడ్డి రెడ్డి పాల్గొన్నారు.