రాప్తాడు: కూటమి ప్రభుత్వంలో 2000 కోట్ల రూపాయల అభివృద్ధి చేశాం పేరూరు విస్తృత స్థాయి సమావేశంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
సత్య సాయి జిల్లా రామగిరి మండలం పేరూరు గ్రామంలో సోమవారం సాయంత్రం నాలుగున్నర గంటల సమయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత ఆధ్వర్యంలో రాప్తాడు టిడిపి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వంలో 2000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయడం జరిగిందని గత మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఐదేళ్ల వైసిపి పాలనలో దౌర్జన్యాలు భూ కబ్జాలు తప్ప నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి చేయలేదని సొంత గ్రామానికి కూడా తామే రోడ్డు నిర్మించామని ఎమ్మెల్యే పరిటాల సునీత మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పై విస్తృతస్థాయి సమావేశంలో విమర్శించారు.