కళ్యాణదుర్గం: కుందుర్పి మండల కేంద్రంలో అధికమైన ట్రాఫిక్ సమస్య, ఇబ్బందులు పడుతున్న జనాలు
కుందుర్పి మండల కేంద్రంలో ట్రాఫిక్ సమస్యతో జనాలు ఇబ్బందులు పడుతున్నారు.ముఖ్యంగా కెనరా బ్యాంకు కూడలిలో ట్రాఫిక్ సమస్య అధికమైంది.బ్యాంకుకు వచ్చే కస్టమర్లు ద్విచక్ర వాహనాలు రోడ్డుపై పార్కు చేస్తున్నారు.దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలియజేసినా పట్టించుకోవడం లేదు.దీంతో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు తీవ్రమవుతున్నది.ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు