కనిగిరి: హనుమంతునిపాడు మండలంలో వైసిపిని బలోపేతం చేసేందుకు నాయకులు కృషి చేయాలి: కనిగిరి వైసీపీ ఇన్చార్జి నారాయణ యాదవ్
హనుమంతునిపాడు మండలంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు కృషి చేయాలని కనిగిరి నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ సూచించారు. ఆదివారం హనుమంతునిపాడు మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన వైసిపి నాయకులు పార్టీ కార్యకర్తల ఐడి కార్డ్స్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసి ఆ జాబితాను నారాయణ యాదవ్ కు అందజేశారు. ఈ సందర్భంగా నారాయణ యాదవ్ మాట్లాడుతూ... పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో పర్యటించి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.