మహబూబ్ నగర్ అర్బన్: అధికార పార్టీకి అనుకూలంగా వార్డుల విభజన చేశారంటూ మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నాయకులు
మహబూబ్ నగర్ నగరపాలిక వార్డుల విభజన అధికార పార్టీకి అనుకూలంగా చేసారని బుధవారం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మున్సిపల్ కమీషనర్ మహేశ్వర్ రెడ్డి కి ఫిర్యాదు చేసారు. వార్డు ల విభజన రోడ్ మ్యాప్ లేకుండా ఇంటి నెంబర్ లతో చేయడం సరికాదని పేర్కొన్నారు. వార్డు ఎక్కడి నుంచి మొదలు అవుతుంది.. ఎక్కడ పూర్తి అవుతుందో ఒక స్పష్టత లేదని తెలిపారు. కొన్ని వార్డులలో 4 వేలకు పైగా ఓటర్లు ఉన్నారని, వార్డు ల విభజన శాస్త్రీయంగా జరగలేదని పేర్కొన్నారు. ఇది అధికార పార్టీకి అనుకూలంగా ఉందని చెప్పారు. మరల అధికారులను వార్డులకు పంపించి వార్డు ల విభజన సరిగ్గా చేయాలనీ కోరారు. వార్డుల విభజన సరిగ్గా జరుగకుంటే న్యాయపరంగా