మహబూబ్ నగర్ అర్బన్: పాలమూరు యూనివర్సిటీలో టీజీ పీఈసెట్ ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్ట రెడ్డి
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో టీజీ పీఈసెట్ నిర్వహించడం ఎంతో గర్వకారణమని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకిష్ట రెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో టీజీపీఈసెట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత పై ఆధారపడి ఉందని యువత సక్రమ మార్గంలో నడవాలని సూచించారు. అంతకుముందు ఆయన క్రికెట్, షార్ట్ పుట్, హై జంప్, క్రికెట్ ఎంపికలను ప్రారంభించారు