మహబూబ్ నగర్ అర్బన్: వృద్ధులు,దివ్యాంగుల అర్జీలను సత్వరం పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి
వృద్ధులు,దివ్యాంగుల సమస్యలను జాప్యం చేయకుండా సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. స్థానిక అర్భన్ తహశీల్దార్ కార్యాలయంలో ప్రతి నెల మొదటి బుధవారం జరిగే వృద్ధుల,దివ్యాంగుల ప్రజావాణి కార్యక్రమం కొన్ని అనివార్య కారణాల వలన రెండో బుధవారం జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. 32 మంది ఫిర్యాదులను స్వీకరించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెలా మొదటి బుధవారం తహశీల్దార్ కార్యాలయంలో జరిగే ఈ కార్యక్రమంలో తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సంబంధింత అధికారులతో సమస్యలు తప్పక పరిష్కారమవుతాయని కలెక్టర్ భరోసా కల