సంతనూతలపాడు: 89 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్
సంతనూతలపాడు లోని తన కార్యాలయంలో ఎమ్మెల్యే విజయ్ కుమార్ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను గురువారం పంపిణీ చేశారు. సంతనూతలపాడు నియోజకవర్గంలోని 89 మంది లబ్ధిదారులకు రూ.47.85 లక్షలు విలువచేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బంది కన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, కార్పొరేట్ వైద్యశాలలో అప్పుచేసి చికిత్స పొందిన రోగులకు ఆర్థిక సహకారం అందించేందుకు సీఎం చంద్రబాబు సీఎం సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకుంటున్నారన్నారు. సీఎంఆర్ఎఫ్ పొందిన లబ్ధిదారులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.