ఉరవకొండ: మోపిడి గ్రామంలో తాగునీరు సరఫరా కాకపోవడంతో మహిళలు, గ్రామస్తుల రాస్తారోకో
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం మోపిడి గ్రామంలో గత 20 రోజులుగా తాగునీరు సరఫరా కాకపోవడంతో శనివారం మధ్యాహ్నం మహిళలు, గ్రామస్తులు రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. తాగునీరు సరఫరాను పట్టించుకోని అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా రాస్తారోకో నిర్వహించారు. గ్రామంలోని ఉరవకొండ-కళ్యాణదుర్గం రహదారి పై బైఠాయించారు. సుమారు గంట పాటు రాస్తారోకో చేశారు. గ్రామంలోని కాలనీలో నీరు సరఫరా కాక పోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సర్ది చెప్పే ప్రయత్నం చేసిన సమస్యను పరిష్కరించాలని పోలీసులతో వాదించారు. *మీ సాక్షి టీవీ లో...*