రాప్తాడు: పేరూరు డ్యామ్ ను నసనకోట గురుకుల పాఠశాలను పరిశీలించిన సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఎమ్మెల్యే పరిటాల సునీత
సత్యసాయి జిల్లా రామగిరి మండలం పేరూరు గ్రామం వద్ద గురువారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఎమ్మెల్యే పరిటాల సునీతతో కలిసి పేరూరు డ్యామ్ ను గురుకుల పాఠశాలను పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ కనగానపల్లి రామగిరి మండలాల్లో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి పనులను పరిశీలించడం జరిగిందని భవిష్యత్తులో రామగిరి కనగానపల్లి మండలాల అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందిస్తానని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.