ఉరవకొండ: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీటి కోసం నీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేయాలని తహసిల్దార్ కు వినతి
అనంతపురం జిల్లా కూడేరు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను ఫ్లోరైడ్ ప్రభావం నుంచి కాపాడేందుకు ప్రతి పాఠశాలలో ఆర్.ఓ (RO) నీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేయాలని కోరుతూ వైఎస్ఆర్ విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు మంజునాథ్ రెడ్డి,ఏఐఎఫ్డిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్దులు మండల తహసిల్దార్ మోహన్ కుమార్ కు సోమవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ కూడేరు మండలంలోని అనేక గ్రామాల్లో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ శాతం అధికంగా ఉండడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు దంతాలు, ఎముకలు ఇతర ఆరోగ్య సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు.