రాప్తాడు: కామారుపల్లిలో మాజీ సర్పంచ్ లక్ష్మీ కళ వార్డు నెంబర్ల సన్మాన సభలో పాల్గొన్న రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని కామారపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 8:30 గంటల వరకు నిర్వహించిన మాజీ సర్పంచ్ లక్ష్మీ కళ వార్డు నెంబర్ల సన్మాన సభలో మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి పాల్గొని మాజీ సర్పంచ్ లక్ష్మీ కళ వార్డు నెంబర్లను సన్మానం చేశారు. ఈ సందర్భంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ కామారపల్లి పంచాయతీ అభివృద్ధి చేయడంలో మాజీ సర్పంచ్ లక్ష్మీ కళ వార్డు నెంబర్లు ఎంతో కృషి చేయడం జరిగిందని రానున్న రోజుల్లో కామారపల్లె అభివృద్ధికి తన వంతు సహకారం కూడా ఉంటుందని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.