కొండపి: టంగుటూరు జాతీయ రహదారికి సమీపంలో బహిరంగంగా మద్యం సేవిస్తున్న ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి జరిమానా విధించిన పోలీసులు
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని 16 నెంబర్ జాతీయ రహదారికి అతి సమీపంలో మద్యం సేవిస్తున్న ఇద్దరినీ గుర్తించిన స్థానిక ఎస్సై నాగమల్లేశ్వరరావు కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు జరిమానా విధించారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో బహిరంగంగా మద్యం తాగుతున్న వారికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు. అలానే మద్యం తాగుతున్న ప్రాంతాన్ని మద్యం తాగుతున్న వారితోనే పరిశుభ్రం చేయించినట్లు ఆయన తెలిపారు.