సంతనూతలపాడు: సంతనూతలపాడు లో ఎస్సీ బాలుర హాస్టల్ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే విజయ్ కుమార్
సంతనూతలపాడు లో నూతనంగా నిర్మిస్తున్న ఎస్సీ బాలుర హాస్టల్ నిర్మాణ పనులను సంతనూతలపాడు ఎమ్మెల్యే బి.ఎన్ విజయ్ కుమార్ సోమవారం పరిశీలించారు. హాస్టల్ భవనాల నిర్మాణ పనుల్లో ఎక్కడ రాజీ పడకుండా, నాణ్యవంతంగా భవనాలను నిర్మించాలని సంబంధిత కాంట్రాక్టర్ ను ఎమ్మెల్యే ఆదేశించారు అదేవిధంగా త్వరితగతిన హాస్టల్ భవనాలు పూర్తిచేసి విద్యార్థులకు అందుబాటులోకి వచ్చే విధంగా చూడాలని సంబంధిత శాఖ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట స్థానిక టిడిపి నాయకులు ఉన్నారు