కనిగిరి: పట్టణంలో అంబేద్కర్ కాంస్య విగ్రహ ఏర్పాటు పనులను పరిశీలించిన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి
కనిగిరి పట్టణంలోని ఒంగోలు బస్టాండ్ సెంటర్ నందు నూతనంగా ఏర్పాటు చేస్తున్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహ ఏర్పాటు పనులను స్థానిక ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తో కలిసి ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కాంస్య విగ్రహ ఏర్పాటుకు దాతలు అందించిన సహకారం, చేపడుతున్న పనుల వివరాలు గురించి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి వివరించారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు దాతలు అందిస్తున్న సహకారం అభినందనీయమని ఈ సందర్భంగా దాతలను ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి అభినందించారు